మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Gayatri Tattva Mala Mantram – శ్రీ గాయత్రీ తత్త్వమాలామంత్రం


అస్య శ్రీగాయత్రీతత్త్వమాలామంత్రస్య విశ్వామిత్ర ఋషిః అనుష్టుప్ ఛందః పరమాత్మా దేవతా హలో బీజాని స్వరాః శక్తయః అవ్యక్తం కీలకం మమ సమస్తపాపక్షయార్థే శ్రీగాయత్రీ మాలామంత్ర జపే వినియోగః |

చతుర్వింశతి తత్త్వానాం యదేకం తత్త్వముత్తమమ్ |
అనుపాధి పరం బ్రహ్మ తత్పరం జ్యోతిరోమితి || 1 ||

యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః |
తస్య ప్రకృతిలీనస్య తత్పరం జ్యోతిరోమితి || 2 ||

తదిత్యాదిపదైర్వాచ్యం పరమం పదమవ్యయమ్ |
అభేదత్వం పదార్థస్య తత్పరం జ్యోతిరోమితి || 3 ||

యస్య మాయాంశభాగేన జగదుత్పద్యతేఽఖిలమ్ |
తస్య సర్వోత్తమం రూపమరూపస్యాభిధీమహి || 4 ||

యం న పశ్యంతి పరమం పశ్యంతోఽపి దివౌకసః |
తం భూతాఖిలదేవం తు సుపర్ణముపధావతామ్ || 5 ||

యదంశః ప్రేరితో జంతుః కర్మపాశనియంత్రితః |
ఆజన్మకృతపాపానామపహంతా ద్విజన్మనామ్ || 6 ||

ఇదం మహామునిప్రోక్తం గాయత్రీతత్త్వముత్తమమ్ |
యః పఠేత్పరయా భక్త్యా స యాతి పరమాం గతిమ్ || 7 ||

సర్వవేదపురాణేషు సాంగోపాంగేషు యత్ఫలమ్ |
సకృదస్య జపాదేవ తత్ఫలం ప్రాప్నుయాన్నరః || 8 ||

అభక్ష్యభక్షణాత్పూతో భవతి | అగమ్యాగమనాత్పూతో భవతి | సర్వపాపేభ్యః పూతో భవతి | ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి | సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | మధ్యం దినముపయుంజానోఽసత్ ప్రతిగ్రహాదిభ్యో ముక్తో భవతి | అనుపప్లవం పురుషార్థమభివదంతి | యం యం కామమభిధ్యాయతి తత్తదేవాప్నోతి పుత్రపౌత్రాన్ కీర్తిసౌభాగ్యాంశ్చోపలభతే | సర్వభూతాత్మమిత్రో దేహాంతే తద్విశిష్టో గాయత్ర్యా పరమం పదమవాప్నోతి ||

ఇతి శ్రీవేదసారే శ్రీ గాయత్రీ తత్త్వమాలామంత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.